Breaking News

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

సారథి న్యూస్​, గద్వాల​: ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్​లో సోమవారం చోటుచేసుకుంది. మల్దకల్ గ్రామానికి చెందిన నాగరాజు భార్య జాహ్నవికి నాలుగేండ్ల క్రితం మొదటి కాన్పులో మగపిల్లవాడు జన్మించాడు. రెండవ కాన్పు కోసం శనివారం కర్నూల్లోని బాలాజీ యశోద నర్సింగ్ హోంలో చేరగా.. ఆమెకు ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు జన్మించారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: