Breaking News

టార్గెట్​ గంగవ్వ.. బిగ్​బాస్​లో కుట్రలు

బిగ్​బాస్​ హౌస్​లో గంగవ్వను టార్గెట్​ చేశారా? ఓట్లతో గంగవ్వను ఢీకొట్టలేమని భావించిన ఇతర కంటెంటెస్టులు ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని కుట్రలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ప్రస్తుతం గంగవ్వకు పడుతున్న ఓట్లు చూస్తే ఆమె టైటిల్​ గెలుచుకోవడం ఖాయం. ఈ విషయాన్ని పసిగట్టిన హౌస్​లోని ఇతర సభ్యులు గంగవ్వను ఒంటరిని చేసి ఆమెతో ఎవరూ మాట్లాడకపోతే గంగవ్వు బోర్​కొట్టి వెళ్లిపోతుందిన భావిస్తున్నారట. గంగవ్వను ఒంటరి చేస్తే.. సంపూర్ణేష్​ బాబు వెళ్లిపోయినట్టు గంగవ్వ కూడా వెళ్లిపోతుందని గ్రూప్​లోని మెజార్టీ సభ్యులు యోచిస్తున్నారట. ఇది గ్రహించిన గంగవ్వ టీం.. ఇంటి బయట మరింత యాక్టివ్​ అయ్యింది. గత వారం కంటే ఈ వారం ఎక్కువ ఓట్లు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది.

గంగవ్వ కోసమే బిగ్​బాస్​ చూస్తున్నారా?
గతంలో బిగ్​బాస్​ గేమ్​ షో అంటేనే ఇష్టపడని చాలా మంది ఇప్పడు కేవలం గంగవ్వ కోసమే ఈ షోను చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పలువురు సోషల్​మీడియాలో బాహాటంగానే వెల్లడించారు. గంగవ్వ మీద ప్రేక్షకుల్లో ఏ రేంజ్​లో అభిమానం ఉందో అర్థమవుతున్నది.

బిగ్​బాస్’ టీం​ ఏం ఆలోచిస్తున్నది..
మొత్తం ఓట్లలో గంగవ్వకే 40 శాతం వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రేక్షకులు కేవలం గంగవ్వ కోసం ఈ షోను చూస్తున్నారు. ఒకవేళ గంగవ్వ హౌస్​ నుంచి వెళ్లిపోతే బిగ్​బాస్​ రేటింగ్​ గ్రామీణ ప్రాంతాల్లో దారుణంగా పడిపోవడం ఖాయం. దీంతో బిగ్​బాస్​టీం గంగవ్వ కొంతకాలం ఉండాలని కోరుకుంటోందట.

Leave a Reply

%d bloggers like this: