Breaking News

‘బిగ్​బాస్’​ ఊపిరి పీల్చుకో.. గంగవ్వ ఇక్కడ

అందరినీ ఆశ్చర్యపరుస్తూ బిగ్​బాస్​4లోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఇప్పుడు ‘షో’ లో దుమ్ముదులుపుతోంది. ఆమెకు సోషల్​మీడియాలో రోజురోజుకు విపరీతమైన ఫాలోయింగ్​ పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే బిగ్​బాస్​ హౌస్​లో అత్యంత ప్రజాధరణ పొందిన కంటెంటెస్ట్​ ఎవరన్నా ఉన్నారంటే అది గంగవ్వే. గంగవ్వ ఆర్మీ పేరుతో ఇప్పటికే ఫేస్​బుక్​ గ్రూప్​లో వాట్సప్​ గ్రూప్​లో వచ్చేశాయి. ఆమె ఫొటోలకు లక్షల్లో లైక్​లు వస్తున్నాయంటే ఆమె క్రేజ్​ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎవరీ గంగవ్వ.. ఆమెకు ఎందుకింత క్రేజ్​..
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లాంబాడిపల్లి గంగవ్వ సొంతూరు. చిన్నవయస్సులో పెళ్లి చేసుకొని ఎన్నో కష్టాలను కొనితెచ్చుకున్నది. తాగుడుకు బానిసైన భర్త నిత్యం వేధించేవాడు. గంగవ్వకు ముగ్గరు సంతానం. భర్త పట్టించుకోకపోవడంతో కుటుంబభారమంతా ఆమె మీద పడింది. బీడీలు చుడుతూ.. కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. లాంబాడి పల్లెకు చెందిన కొంతమంది యువకులు ‘మై విలేజ్​ షో’ అనే యూట్యూబ్​ చానల్​ను ప్రారంభించడం. ఆ షోలో గంగవ్వ క్యారెక్టర్​ హైలెట్​ కావడంతో ఆమె రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది. గంగవ్వను పెట్టి తీసిన ఎపిసోడ్స్​కు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్​ క్రేజ్​ వచ్చేసింది. లక్షల్లో వ్యూస్​ వచ్చేవి. దీంతో గంగవ్వ స్టార్​ సెలబ్రిటీగా మారింది. సమంతా, విజయ్​దేవరకొండ వంటి వారిని సైతం ఆమె ఇంటర్వ్యూ చేసిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఎంత క్రేజ్​ ఉందో ఊహించుకోవచ్చు.

అనూహ్యంగా బిగ్​బాస్​ హౌస్​లోకి..
అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్​బాస్​ టీం గంగవ్వను సెలక్ట్​ చేసింది. దీంతో ఆమె హౌస్​లోకి వెళ్లాక.. బిగ్​బాస్​ను ఇప్పటివరకు చూడని వారు సైతం గంగవ్వ కోసం చూస్తామంటున్నారు. ఆమెకు ఓట్లు వేస్తామంటూ సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పడు తాజాగా సోషల్​మీడియాలో ఉన్న ట్రెండ్స్​ను గమనిస్తే గంగవ్వ టాప్​లో ఉంది. గంగవ్వ దెబ్బకు రికార్డులు షేక్ అవుతున్నాయి. ఇప్పటివరకు బిగ్​బాస్​ హౌస్​లో ఏ సెలబ్రిటికీ రానంత క్రేజ్​ గంగవ్వకు వచ్చేసింది. హాట్ స్టార్‌లో ఒక్కొక్కరు పది ఓట్లు వేసే వీలుంది. ఇప్పటి వరకు ఈ రెండు రోజుల్లో పడిన ఓట్లలో 50 శాతం పైగా ఓట్లు గంగవ్వకే పడ్డాయి. గంగవ్వ దెబ్బకు మిగిలిన గ్రూప్​ సభ్యులు హడలిపోతున్నారు. చివరి వరకు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇప్పటివరకయితే గంగవ్వే టాప్​లో ఉంది.

Leave a Reply

%d bloggers like this: