Breaking News

జోగుళాంబ సన్నిధిలో అడిషనల్ కలెక్టర్​

జోగుళాంబ సన్నిధిలో అడిషనల్ కలెక్టర్​

సారథి, అలంపూర్(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అడిషనల్ ​కలెక్టర్ రఘురామశర్మ బుధవారం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి వెబ్​సైట్ నుంచి అందిన ఫిర్యాదులపై సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ఊట్కూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వభూమిలో గతంలో లావాణీ పట్టాలు ఇచ్చినా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో రైతుల భూములను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ విషయమై సమగ్ర నివేదిక సమర్పించాలని తహసీల్దార్ ను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మదన్ మోహన్, నాయబ్ తహసీల్దార్ భూపాల్ రెడ్డి, సర్వేయర్ వెంకటలక్ష్మి, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: