Breaking News

బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి

బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి

సారథి, నాగర్​కర్నూల్: ముస్లింల పవిత్ర బక్రీద్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం పండుగ కావడంతో ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కురిస్తే నమాజ్​కు ఇబ్బందులు తలెత్తకుండా మసీదుల్లోనే ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లుచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈద్గాకు పెయింటింగ్ వేయించడంతో పాటు ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించారు. స్టోన్​డస్ట్​పోసి బురదను సరిచేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని జామా మసీద్​ను ముస్తాబు చేశారు. మసీద్ ఏ ఖమర్ ఉన్నిసా, మూసామసీద్ లో ఏడు గంటలకు, మసీద్​ఏ మేరేజ్ లో ఏడున్నర గంటలకు, హౌసింగ్ బోర్డు కాలనీలోని మహ్మదీయ మసీదులో 8:30 గంటలకు వక్ఫ్ కాంప్లెక్స్ లోని మహాఫుజ్ బిన్ లో ఎనిమిది గంటలకు ప్రత్యేక నమాజ్ చేయనున్నారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి నమాజ్​చేయాలని ముస్లిం మతపెద్దలు కోరారు.

Leave a Reply

%d bloggers like this: