Breaking News

కరీంనగర్

‘అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’

‘అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’

సారథి, చొప్పదండి: నియోజకవర్గ అభివృద్ధి కోసం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్​నేతలు హితవు పలికారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్​ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ సోమిడి శ్రీనివాస్, భక్తు విజయ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ కనుమల్ల రాజశేఖర్ తదితరులు చొప్పదండిలోని అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్​ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ […]

Read More
ఆపదలో ఉన్నవారికి సర్కారు అండ

ఆపదలో ఉన్నవారికి సర్కారు అండ

సారథి, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.5,41,500 సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్​ ఫండ్​ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం […]

Read More
సర్పంచ్ ఔదార్యం

సర్పంచ్ ఔదార్యం

సారథి, రామడుగు: ఆపదలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడి పట్ల సర్పంచ్ ఔదార్యం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు రేణిగుంట రాజమల్లయ్య శనివారం అనారోగ్యానికి గురైయ్యాడు. ఆయనను వెంటనే కరీంనగర్ ​సిటీ దవాఖానకు తరలించగా ట్రీట్​మెంట్​ పొందుతున్నాడు. గోపాల్​రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న వెంకట్రామిరెడ్డి శనివారం రాజమల్లయ్యను పరామర్శించి రూ.15వేలు అందజేశారు. వైద్యచికిత్సల కోసం అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Read More
రాజన్న గోశాల నుంచి కోడెల వితరణ

రాజన్న గోశాల నుంచి కోడెల వితరణ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి తిప్పాపూర్ గోశాల నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కీలనపల్లి గ్రామ వినాయక గోశాల వెల్ఫేర్ సొసైటీకి 20 కోడెలను శనివారం వితరణగా ఇచ్చారు. కార్యక్రమంలో గోలి శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఎల్.రాజేందర్, గోశాల ఇన్​చార్జ్​శంకర్ పాల్గొన్నారు.

Read More
వక్ఫ్ భూములను కాపాడండి

వక్ఫ్ భూములను కాపాడండి

సారథి, వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ సర్వేనం.41,42,43 వక్ఫ్‌ బోర్డు భూముల్లో నిర్మిస్తున్న అక్రమకట్టడాలను కాపాడాలని పలువురు ముస్లింలు శనివారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ కు కలిసి వినతిపత్రం అందజేశారు. తిప్పాపూర్ లో చాలా వరకు వక్ఫ్‌ బోర్డు భూములు అన్యాక్రాంతమై ఉన్నాయన్నారు. వాటికి రక్షణ కంచె వేసి కాపాడాలని కోరారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు వేములవాడ అర్బన్ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు.

Read More
‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించాలే’

‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించాలే’

సారథి, చొప్పదండి: సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం అవసరమని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సంబోజీ సునీల్, నెల్లి సంతోష్, బండారి అఖిల్ నాయకులు పాల్గొన్నారు.

Read More
సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి రాజేష్ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ ​సంజయ్ కుమార్, జడ్పీ చైర్​పర్సన్​ దావా వసంత కలిసి గురువారం పంపిణీ చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ క్లస్టర్ గ్రామ రైతువేదికను ప్రారంభించారు. ఇటీవల మొరపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడమల నాగరాజు మరణించగా వారి కుటుంబసభ్యులకు రూ.ఐదులక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. అనంతరం […]

Read More
ప్రగతిభవన్ ముట్టడి.. బీజేవైఎం నేతల అరెస్ట్​

ప్రగతిభవన్ ముట్టడి.. బీజేవైఎం నేతల అరెస్ట్​

సారథి, రామడుగు: ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న భారతీయ జనతా యువమోర్చా మండల నాయకులను రామడుగు ఎస్సై నరేష్ గురువారం అరెస్ట్​చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్​అయిన వారిలో యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండలాధ్యక్షుడు దురిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కార్యదర్శి బుర్ర […]

Read More
%d bloggers like this: