Breaking News

మహబూబ్‌నగర్

కులాలుగా విభజించి పనులు చేయడం సరికాదు

కులాలుగా విభజించి పనులు చేయడం సరికాదు

సారథి, బిజినేపల్లి: ఉపాధిహామీ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలను కులాల వారీగా విభజించి పనులు చేయించడం సరికాదని, సంబంధిత జీవోను వెంటనే రద్దుచేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్)​జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పనుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​నిధులను ఖర్చుచేయడం సరికాదన్నారు. గురువారం బిజినేపల్లి తహసీల్దార్​ ఆఫీసు ఎదుట కేవీపీఎస్ ​ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2005లో నాటి ప్రభుత్వం కులాలు, మతాలకతీతంగా […]

Read More
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీపీ పి.శ్రీనివాస్​గౌడ్​ గురువారం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉజ్వల భవిష్యత్​ను ఏర్పాటుచేసుకుని తద్వారా భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శారదమ్మ, సర్పంచ్​ఎస్.మహేశ్​రావు, ఎస్ఎంసీ చైర్మన్​బి.యాదయ్య, ఉపాధ్యాయులు భాస్కర్​రెడ్డి, జహంగీర్, నాగేశ్వర్ రావు, సుధారాణి పాల్గొన్నారు.

Read More
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయండి

చిన్నారులకు సకాలంలో టీకాలు వేయండి

సారథి, నాగర్​కర్నూల్: జిల్లాలో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహణపై బుధవారం జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్​వో) డాక్టర్​ సుధాకర్​లాల్ ​వైద్యాధికారులతో జూమ్​ మీటింగ్ ​నిర్వహించారు. చిన్నారులను గుర్తించి సకాలంలో బీసీజీ టీకాలు వేయాలని సూచించారు. తదుపరి సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెచ్ఎంఐఎస్ ​ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని అన్నారు. టెలీమెడిసిన్ విధానాన్ని రోగులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో […]

Read More
లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ

సారథి, కోడేరు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నాగర్​కర్నూల్ ​జిల్లా కొల్లాపూర్​ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు రూ.10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. కోడేరు మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. కరోనా కారణంగా సంవత్సరన్నర కాలంగా […]

Read More
రేషన్ డీలర్లకు గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలి

రేషన్ డీలర్లకు గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలి

సారథి, వెల్దండ: రేషన్ డీలర్లకు గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం వెల్దండ మండలాధ్యక్షుడు జంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు 25 ఏళ్లుగా చాలీచాలని కమీషన్లతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రేషన్ డీలర్ల కనీస వేతనం ఇవ్వాలని, జీవితబీమా వర్తింప చేయాలని, హమాలీ చార్జీలను ప్రభుత్వమే […]

Read More
కాంగ్రెస్​నాయకుల అరెస్ట్​

కాంగ్రెస్​ నాయకుల అరెస్ట్​

సారథి, ఉండవెల్లి/అయిజ(మానవపాడు): దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన పెగసిస్ స్ర్రైవేర్ ​ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాజ్ భవన్ ముందు ధర్నాకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉండవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సింగల్ విండో చైర్మన్ గజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అరెస్ట్​లతో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలను […]

Read More
తేమ పేరుతో దోపిడీ చేసిన్రు

తేమ పేరుతో దోపిడీ చేసిన్రు

20.80 క్వింటాళ్ల వరి ధాన్యం డబ్బులు నష్టపోయా.. ప్రజాప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి సోషల్​ మీడియా ద్వారా ఓ రైతు ఏకరువు సారథి, బిజినేపల్లి: తేమ సాకుతో తనను నిలువునా దోపిడీ చేశారని ఓ రైతు ఆక్రందన వ్యక్తం చేశాడు. తన బాధను సోషల్​మీడియా ద్వారా గురువారం నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కలెక్టర్​ ఎల్.శర్మన్​కు విన్నవించారు. తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరాడు. తన ఆవేదనను ఇలా పంచుకున్నాడు. ‘నా పేరు […]

Read More
అర్చకులను వేధిస్తే ఊరుకోం..

అర్చకులను వేధిస్తే ఊరుకోం..

సారథి, అలంపూర్(మానవపాడు): ఎలాంటి ఆదాయవనరు లేకపోయినా, చాలీచాలని వేతనాలతో గ్రామాల్లో ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చకులను ఇటీవల కొందరు పెత్తందారులు వేధింపులకు పాల్పడుతున్నారని అర్చకసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్చకులకు వచ్చే వేతనాల్లో తమకు వాటా ఇవ్వాలని వేధింపులకు పాల్పడటం శోచనీయమని పేర్కొన్నారు. ధూప దీప నైవేద్యం పథకం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.ఆరువేల వేతనంలో రూ.రెండువేలు పూజాసామాగ్రికే సరిపోతుందని, […]

Read More
%d bloggers like this: