Breaking News

మెదక్

‘ఉపాధి’పై సామాజిక తనిఖీ

‘ఉపాధి’పై సామాజిక తనిఖీ

సారథి, రామయంపేట: ఉమ్మడి రామయంపేట మండలంలోని పలు గ్రామాల్లో 2018 నుంచి 2021 వరకు జరిగిన రూ 8 కోట్ల 76 లక్షల ఉపాధిహామీ పనుల రికార్డులను శుక్రవారం నిజాంపేట మండలకేంద్రంలో ఆడిట్​చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ ఆడిట్ జూలై 16 నుంచి 30 వరకు జరిగిందని దీనిలో భాగంగా మాస్టర్స్ వేరిఫికేషన్, ఎంబీ రికార్డ్స్ వేరిఫికేషన్, కూలీలకు సక్రమంగా పేమెంట్స్ జరుగుతున్నాయా లేదా? అనే అంశాలపై రిప్రజెంట్ చేశారని ఆయన తెలిపారు. […]

Read More
భవిత కేంద్రంలో తనిఖీ

భవిత కేంద్రంలో తనిఖీ

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా సెక్టరియల్ అధికారి ఆర్.సూర్యప్రకాష్ శుక్రవారం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండల ఐఈఆర్ డీ సమన్వయకర్తకు పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల సంఖ్య, వారికి అవసరమైన సదుపాయాలు, వారికి ఉన్న వనరులను ప్రత్యేకంగా మండల సమన్వయకర్తకు వివరించారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు ప్రతి పిల్లవాడికి చేరేలా కృషిచేయాలని సూచించారు. టెలీసర్వీస్ ప్రతిరోజు పిల్లవాడికి […]

Read More
రాజన్న హుండీ గలగల

రాజన్న హుండీ గలగల

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు కౌంటింగ్​చేశారు. ఆలయానికి రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. 198 గ్రాముల బంగారం, 11 కిలోలన్నర వెండి వచ్చింది. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.

Read More
దళితులపై బీజేపీ చిన్నచూపు

‘దళితులపై బీజేపీ చిన్నచూపు’

సారథి,పెద్దశంకరంపేట: దళితులను బీజేపీ, ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మెదక్​జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ దళిత సర్పంచ్ మహేశ్వరి నరేష్​ను ఎమ్మెల్యే రఘునందన్ రావు అవమానించడం, దళితుల పట్ల ఆయనకు ఉన్న చిన్నచూపు, బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఎంపీపీ, సర్పంచ్​కు చెప్పకుండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Read More
పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

సారథి, పెద్దశంకరంపేట: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని నారాయణఖేడ్​ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆయన మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 161 రేషన్​కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు ఆకలి బాధ ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో నూతనంగా రేషన్​ కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాంతంలో 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో […]

Read More
విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

సారథి, పెద్దశంకరంపేట: విద్యార్థులు విద్యతో పాటు అన్నిరంగాల్లోనూ రాణించాలని బాలికల ఉన్నత పాఠశాల ఇన్​చార్జ్​ హెచ్ఎం లత సూచించారు. శుక్రవారం బాలికల ఉన్నత పాఠశాలలో బుక్స్ ​పంపిణీ చేశారు. భవిష్యత్​లో రాణించాలంటే విద్యార్థి దశ కీలకమని ఆమె సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్​లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ రవీందర్, టీచర్లు రామకృష్ణగౌడ్, జనార్ధన్, సల్మా, సోనుభాయ్, బసమ్మ, ఎమ్మార్పీ […]

Read More
బోదకాల నివారణ మాత్రలు పంపిణీ

బోదకాల నివారణ మాత్రలు పంపిణీ

సారథి, రామాయంపేట: బోదవ్యాధి నివారణకు గురువారం రామాయంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో డాక్టర్లు మాత్రలు పంపిణీ చేశారు. భోజనం తర్వాత వాటిని వేసుకోవాలని సెంట్రల్ అబ్జర్వర్ ​డాక్టర్ రవీంద్ర, కుమారస్వామి, జిల్లా మలేరియా ఆఫీసర్ సూచించారు. కార్యక్రమంలో ధర్మారం పీహెచ్​సీ డాక్టర్ ఎలిజబెత్ రాణి, హెచ్​ఈవో రవీందర్, ఆరోగ్య కార్యకర్తలు, వలంటీర్లు పాల్గొన్నారు.

Read More
వెదజల్లే పద్ధతిలో అధిక లాభాలు

వెదజల్లే పద్ధతిలో అధిక లాభాలు

సారథి, పెద్దశంకరంపేట: వరి పంట సాగులో వెదజల్లే పద్ధతి ద్వారా అధిక దిగుబడి సాధించవని మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల వ్యవసాయాధికారి అమృత అన్నారు. గురువారం మండలంలోని ఉత్తులూర్ శివారులో డ్రమ్​సీడర్ ద్వారా వరిసాగులో వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేశారు. ఈ పద్ధతిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఏఈవో రాజు, పలువురు రైతులు ఉన్నారు.

Read More
%d bloggers like this: