Breaking News

సాహితీలోకం

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి సీఎం కేసీఆర్​ కృషిచేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. శనివారం ఆయన రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదావరిఖని ప్రెస్​క్లబ్​ భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ చైతన్యానికి మారుపేరుగా నిలిచిందని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. మొట్టమొదట […]

Read More
అణచివేతకు అద్దం పట్టిన జాషువా సాహిత్యం

అణచివేతకు అద్దం పట్టిన జాషువా సాహిత్యం

సత్కవి గుర్రం జాషువా భారతరత్న డాక్టర్​బాబాసాహెబ్ అంబేద్కర్ సమకాలికుడు. అంబేద్కర్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు. అస్పృశ్యతను చవిచూసిన ఈ కవిరేణ్యుడు తన ఖండ కావ్యం ‘గబ్బిలం’ లో నాటి సామాజిక వ్యవస్థ మూలాలు, అమానవీయ దౌష్ట్యాన్ని కరుణారస భరితంగా వర్ణించి సాహిత్య వేదికపై మానవ జాతిని మేలు కొల్పిన సంఘసంస్కర్త. మరీ ముఖ్యంగా అరుంధతీయుల దుర్భర జీవనగతులను ‘ప్రశ్నించే చైతన్యం’తో అనుసంధించి సమర సతాత్మక ప్రబోధంతో సమాజాన్ని తట్టిలేపిన విశ్వనరుడు. జాతీయోద్యమం స్ఫూర్తితో దేశభక్తి కొత్తపుంతలు తొక్కుతున్న […]

Read More

క్షమించు తల్లీ..!

కోరికల కోరలు చాచిన తాచుల చుట్టూనా గారాల పట్టి చప్పుడు ఆగిపోయేనా ! కత్తుల పదును వాంఛలున్న ఉన్మాదుల మధ్యకుత్తుక ఆగి కొట్టుమిట్టాడేనా ! బలంతో విర్రవీగే బకాసురాల నడుమబలహీనమై నీ వెన్నుపూస విరిగేనా ! కామంతో మసిలిన ఆ కాల యముళ్లునీ కలలను కడతేర్చారా తల్లి ! నరరూప “మాన భక్షకులు”నీ నాలుక తెగ్గోసారా చెల్లి !! ఏ రాముడు దుష్ట సంహారం చేయలేదు,క్షమించు..చీకటి సాక్షిగా నిప్పులో తోసేసాము !! బచావో అన్న నీ కన్నవాళ్ళ […]

Read More
పిల్లలతో కథలు చదివిద్దాం..రండి

పిల్లలతో కథలు చదివిద్దాం.. రండి

వెబ్​సైట్లలో నీతి కథలు, ఇతిహాసాలు చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానం సారథి న్యూస్, రామాయంపేట: కరోనా పుణ్యమా..! అని విద్యార్థులు చదువులు, పరీక్షలు మానేసి ఆన్ లైన్​గేమ్స్ తో స్టూడెంట్స్ కుస్తీ పడుతున్నారు. పిల్లలు ఇంట్లో ఉన్న డాడీ లేదా మమ్మీ స్మార్ట్ ఫోన్లలో లేదా ఇంట్లో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్ నెట్ ​ప్రపంచాన్నే చుట్టేస్తున్నారు. ఆన్​లైన్ లో పిల్లలు ఏవేవో చూసి సమయాన్ని వృథాచేసుకునే బదులు నైతిక విలువలు, మన సంస్కృతి సంప్రదాయలను […]

Read More
ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా?

ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా?

అన్నింటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాడు మండుటెండలో వెళ్తూ ఎండకు ఓర్చుకోలేక, చెప్పులు కుట్టే ఓ వ్యక్తి దారిలో పెట్టిన చెప్పులపై కొంతసేపు నిలబడ్డాడు. ఆ మాత్రం నిలబడినందున, ఆ రుణం తీర్చుకోవడానికి మరోజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు అనే దంపతులకు సునందుడు అనే కొడుకు పుట్టాడు. జాతకం చూపిస్తే పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేశారు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉంటాడు. ‘వాడి చేతి నుంచి […]

Read More
తల రాతలు యిలానే ఏడుస్తాయి

తలరాతలు యిలానే ఏడుస్తాయి

విశ్వమంతాహాయిగానే ఊపిరిపీల్చుకుంటున్నది ఏ మస్తిష్కమూభయ కీలలలోతగలబడి పోవడం లేదు కమురు వాసనఏ నాసికకూఅతుక్కోవడం లేదు ప్రజలు స్వేచ్ఛగాదేహాలను విసిరేసు కుంటున్నారు మృత్యు సముద్రంలోశవాల జాడ లేదుకొంగ్రొత్త రోగపు కడలిలో పార్థివ శరీరాల ఉనికే లేదు అవునుమీరు వింటున్నది నిజమేమీ కర్ణేంద్రియాలు సరిగ్గానే పనిచేస్తున్నాయిలాహిరి లాహిరి లాహిరిలోదేహాలుసుఖాల కెరటాలపైఊయలలు ఊగుతూ ఉన్నాయిఎచ్చోటనూవసంతంతనువు చాలించలేదు పాపంఆవిడొక్కత్తియిందుకు మినహాయింపు సామూహికశవదహనాలు సగం కాలిన దేహాలు ముద్ద దొరకనిప్రజాస్వామ్య ప్రాణాలు నడుస్తూనేఅగిపోతున్న ఊపిర్లు ఇవేవీపతాక శీర్షికలు కావుబలిసినఅక్షరాలవ్వవుఏ మారుమూలోకనీకనబడకనక్కినక్కి దాక్కుంటాయికంటినిభూగోళమంతవిప్పారిస్తేగానీదృశ్యం అర్థమవదు అయ్యో!అందానికి […]

Read More

తెలుగు వెలగాలి

తరతరాల తెలుగు.. ఇలా వెలుగుఏ ప్రపుల్ల సుమంబుల ఈశ్వరునకుపూజ సల్పితినో యేను పూర్వమందుకలదయేని పునర్జన్మ కలుగుగాకమధుర మధురమౌ తెలుగు నా మాతృభాష!!– అని రాయప్రోలు సుబ్బారావు తేట తెలుగు మాధుర్యాన్నితీయనైన పద్యం ద్వారా చెప్పారు.ఆయనే ఓ మాట అన్నారు..‘ఏ దేశమేగినా.. ఏ పీఠమెక్కినా పొగడరా నీతల్లి భారతిని’ అని ఆ వాక్యాన్ని కాస్తా తెలుగుకు అన్వయించుకుంటే మనం ఎక్కడున్నా, రెండు రాష్ట్రాల వారమైనా తెలుగు వారమే. ఆ భాషా మాధ్యుర్యాన్ని తొలి గురువు అమ్మనోట విని పులకించినవారమే. […]

Read More

అక్షరం.. ఆరాధ్యదైవం

సవర జాతి గిరిజనుల విశిష్ట సంస్కృతి ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో భాషా గుళ్లు భాషకు రూపం అక్షరం. సరస్వతీ నమస్తుభ్యం..అంటూ అక్షరాభ్యాస వేళ గురువు రాయించే ‘అ..ఆ’లే మన జీవన గమనానికి , భాషా పాటవానికి తొలి అడుగు. అనంతర కాలంలో మనం అక్షరాన్ని దిద్దినా, ప్రేమించినా ఆరాధించడం అనేది ఓ భావనగానే కొనసాగుతుంటుంది. ఇందుకు భిన్నం శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం గుణుపురం సమీప మిర్చిగుడ, శ్రీకాకుళం జిల్లా భామిని మండలానికి చెందిన భామిని […]

Read More
%d bloggers like this: